బలగం టివి ,వేములవాడ
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.
వేములవాడ మండలం, నాంపల్లి గ్రామానికి చెందిన నగరపు ప్రశాంత్ వీరిది నిరుపేద కుటుంబం. ఇతనికి ఇద్దరు చిన్న పిల్లలు. బ్రతుకు దెరువు కోసం కూలిపనికి వెళ్ళే సమయంలో జనవరి 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలువిరిగి మోకాలు వరకు కాలు తీసివెయ్యడం జరిగింది. తలకి గాయాలు కావటం వలన తలలో రక్తం గడ్డ కట్టింది. సర్జరీ ఆలస్యం చేస్తే ప్రాణాలకి ప్రమాదం అని డాక్టర్లు అన్నారు. వైద్యానికి 10లక్షల వరకు అవసరం అవుతుందని రేనీ హాస్పిటల్ వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితి. ఈ విషయం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ను ఆశ్రయించారు. ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని ట్రస్టు ద్వారా సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో పోస్టు చేయగా మానవతా దృక్పథంతో దాతలు స్పందించి 10 వేల రూపాయలు అందించడం తో నాంపల్లి గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఇట్టి రూపాయలు అందజేశారు. ఇంకా ఎవరైనా దాతలు స్పందించి తమకు తోచిన విరాళాలు ట్రస్టు 89855 88060 నంబరుకు పంపిస్తే వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని ట్రస్టు నిర్వాహకులు తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, డాక్టర్. బెజ్జంకి రవీందర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పాత సంతోష్, కట్ట రమేష్ నాంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.