బలగం టివి ,
.
నకిరేకల్ ని సుందరంగా తీర్చిదిద్దుకుందాం….
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు
అందరి భాగస్వామ్యంతో భవిష్యత్తు తరాలకు అందమైన పట్టణాన్ని అందిద్దాం….
నకిరేకల్ మాస్టర్ ప్లాన్ పునర్విభజన సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

నకిరేకల్ పట్టణాన్ని మరింత సుందరీకరనే తమ లక్ష్యమని.. అందుకోసం ఎన్ని నిధులైన వెనుకాడేది లేదని.. నాణ్యతలో ఏమాత్రం రాజీపడమని నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్నారు. పట్టణం దిన దినాభివృద్ధి చెందుతున్న తరుణంలో.. అందుకు తగిన విధంగా పట్టణాన్ని రూపందించు కోవడంలో అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులూ రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని.. నకిరేకల్ పట్టణాన్ని మరింత సుందర పట్టణంగా తీర్చిదిద్దుకుని భావితరాలకు అద్భుతమైన పట్టణాన్ని అందించడం సాధ్యమవుతుందన్నారు. బుధవారం నాడు పట్టణంలోని శకుంతల ఫంక్షన్ హాల్ లో జరిగిన మాస్టర్ ప్లాన్ పునర్విభజన సమావేశానికి హాజరై మాట్లాడారు. గతంలో ఉన్న పాలకులు, పట్టించుకోక పోవడం వల్లనే పట్టణంలో రోడ్లు, డ్రెయినేజీ సమస్యలు ఉన్నాయి అని అన్నారు . ప్రజలు వీటిని గుర్తించాలన్నారు. ఇప్పటికైనా మన మాస్టర్ ప్లాన్ ను సరిచేసుకొని భవిషత్తు తరాలకు సుందరమైన పట్టణాన్ని అందించుకుందాము అన్నారు. వివిధ సమస్యలపై ప్రముఖుల నుండి వచ్చిన సలహాలను స్వీకరించి ప్రతి సమస్య ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు..
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు..