సిరిసిల్ల న్యూస్:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ చెక్ పోస్ట్ వద్ద నాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు వెహికల్ ను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో కొండూరి రవీందర్ రావు పోలీసుల తనిఖీకి పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరం నాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అక్కడి నుంచి బయలుదేరారు.