ఆ ఇద్దరు అక్కాచెల్లెలు అధికార పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఒకరేమో పార్టీ పగ్గాలు చేతపట్టి గల్లీ నుంచి ఢిల్లీ(Delhi) స్థాయిలో రాజకీయ రణరంగంలో భీకర యుద్ధానికి సిద్ధం అవుతుంటే… మరొకరు భర్త కోసం పార్టీ బాధ్యతలు భుజ స్కంధాలపై మోస్తూ జనంలో మమేకం అవుతున్నారు. ఒకరు డిల్లీ పెద్దల నుంచి ప్రతికూల వాతావరణం ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేలా చేస్తుంటే… మరొకరు ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత వచ్చేలా చేస్తూ ఊరూరా యాత్రలు చేపడుతున్నారు. నాటి నందమూరి ఆడపడుచులుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి(Purandeshwari), నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ప్రతిపక్షాలలో ఉన్న ఆ అక్కాచెల్లెలు కంటిలో నలుసుగా మారి ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వాని ఇబ్బంది పెడుతున్నారా….? ఇంతకీ ఎవరా అక్కాచెల్లెలు…?
అమీ తుమీకి సిద్దపడిన అక్కాచెల్లెలు..
దేశంలో అన్ని ప్రాంతాలకంటే ఏపీ రాజకీయాలు నిత్యం హాట్ టాపిఫ్ గా మారుతూనే ఉంటాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అంటూ వేసే ఎత్తుగడలని ఒకరిపై మరొకరు చిత్తు చేస్తూ మరో నూతన అధ్యాయానికి తెర లేపుతుంటారు. తాజా పరిణామాలు ఒక్క ఘటనతో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. ఓ వైయు ఎన్నికలు దగ్గరపడుతుండటం, మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయడంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ పై నందమూరి ఆడపడుచులు యుద్ధం ప్రకటించడం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. బాబును అరెస్ట్ చేయడంతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి వైసీపీపై యుద్ధం ప్రకటించారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కూడా వైసీపీపై విమర్శల దాడిని పెంచారు.
ఏపీలో అధికార పార్టీతో ప్రత్యక్ష యుద్దం..
40 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని భవనేశ్వరి….తన భర్త కోసం తొలిసారిగా రోడ్డెక్కారు. తన అత్తగారి ఊరైన నారావారిపల్లె నుంచే భువనేశ్వరి రాజకీయ ప్రయాణం మొదలెట్టారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భువనేశ్వరి చేస్తున్న విమర్శలు ప్రతి రోజూ హైలెట్ అవుతున్నాయి. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఎనిమిదేళ్లకు అంటే 2004లో దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయాల్లోకి వచ్చారు. ఐతే ఆమె పొలిటికల్ ఎంట్రీ టీడీపీ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచి జరిగింది. తొలుత ఎంపీగా గెలిచిన ఆమె.. ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కాంగ్రెస్ తో ప్రయాణం ముగించి బీజేపీలో చేరిన పురందేశ్వరి ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పురందేశ్వరి.. వైసీపీ సర్కార్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం ఇచ్చిన నిధుల డైవర్షన్, ఇళ్ల నిర్మాణం, మద్యంపాలసీలపై ఆమె వైసీపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ పై నేరుగానే సమరానికి సై అంటూ కాలు దువ్వుతున్నారు. ప్రభుత్వాని ఇరుకున పెట్టి… ప్రజల్లో అధికార పార్టీని ప్రాబల్యాన్ని తగ్గించే కృషి చేస్తున్నారు. ఇది ఇలానే సాగితే అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.