బలగం టివి, తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన లో భాగంగా చేపట్టిన నారీ శక్తి వందన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ శోభా రెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ, నవీన్ యాదవ్,మరియు బిజెపి సీనియర్ నాయకులు ఆసాని రామలింగారెడ్డి,మండల జనరల్ సెక్రెటరీ అమరగొండ రాజు,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కలికోట కాళీ చరణ్,బీజేవైఎం మాజీ అధ్యక్షులు కోల ఆంజనేయులు,ఇటుకల మహేందర్,ఇటుకల రాజు,సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.