జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా: సిరిసిల్ల ఐటీఐలో డిసెంబర్ 8న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

0
37

తెలంగాణ ప్రభుత్వము ఉపాది మరియు శిక్షణా శాఖ

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ, (మండేపల్లి ) సిరిసిల్ల లో జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా

బలగం టీవీ, సిరిసిల్ల:

నిరుద్యోగ యువతకు, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో, సిరిసిల్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ), మండేపల్లిలో డిసెంబర్ 8, 2025 సోమవారం నాడు జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించబడుతున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎస్. కవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళా సోమవారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది.

ఈ అప్రెంటిస్ షిప్ మేళాలో 1). ఆదర్శ ఆటో మోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేములవాడ, 2). వరలక్ష్మి సిరిసిల్ల, 3). ఫెనెస్టా బిల్డింగ్ సిస్టమ్స్ మేడ్చల్ హైదరాబాద్, 4). ఆరీఫ్ మోటార్స్ సిరిసిల్ల, 5). జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ శంషాబాద్, 6). మేధా సర్వో డ్రైవ్స్ హైదరాబాద్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. నవంబర్ 2025 నాటికి ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ డిజిల్, మెకానిక్ మోటార్ వెహికల్ మరియు వెల్డర్ ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు తమ వెంట ఎస్ఎస్‌సీ మెమో, ఐటీఐ మెమో, 2 ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు మరియు 4 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని హాజరు కావాలని ప్రిన్సిపాల్ ఎస్. కవిత తెలియజేశారు.

అభ్యర్థులు మరింత సమాచారం కోసం www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా సెల్: 8688612666 నంబర్‌ను సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here