బలగంటివి,
- అనిల్ కు విశిష్ట స్ఫూర్తి చిత్రకళా రత్న జాతీయ అవార్డు
- రమేష్ కు విరాట్ విశ్వకర్మ సేవా రత్న జాతీయ అవార్డు
- 👉ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్, పర్యావరణ ప్రేమికుడు దుంపెన రమేష్ లు ఆదివారం హనుమకొండ టిఎన్జీవో భవన్ లో యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ విశ్వకర్మ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు 2024 సందర్భంగా జాతీయ అవార్డులను ప్రధానం చేశారు. కార్వింగ్ కళా రంగంలో అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గుమ్మడికాయ, క్యారెట్ల తో కలిపి రామమందిరాన్ని తయారు చేసిన సందర్భంగా గుర్తించి విశిష్ట స్ఫూర్తి చిత్రకళా రత్న జాతీయ అవార్డును అందజేశారు. మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండల ప్రజలకు పర్యావరణాన్ని కాపాడుతూ మొక్కలను పంచుతూ పెంచుతూ కృషి చేసినందుకు విరాట్ విశ్వకర్మ సేవా రత్న జాతీయ అవార్డును అందజేశారు. ఈ అవార్డులను స్వచ్ఛంద సేవా సమితి చైర్మన్ బ్రహ్మశ్రీ డాక్టర్ వలభోజు మోహన్ రావు, కోఆర్డినేటర్ బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ సమక్షంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె నాగరాజు, హనుమకొండ జెడ్పి చైర్ పర్సన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ చేతుల మీదుగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
👉 ఈ సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీతలకు ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి,మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి, లయన్స్ క్లబ్ నిర్వాహకులు నంది కిషన్, పయ్యావుల రామచంద్రం,మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్ది, ప్రముఖ ఫోటోగ్రాఫర్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు జితేందర్, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, పిపి రాం గౌడ్, ఫోటోగ్రాఫర్స్ షాదుల్, అజ్జు, మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,బిజెపి సీనియర్ నాయకులు నేవూరి దేవేందర్ రెడ్డి,నేవూరి సురేందర్ రెడ్డి, యమగోండ బాల్ రెడ్ది, దొంతి అమరేందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కోడుమోజు దేవేందర్, సాన రవి, బాధ రమేష్, కోల మోహన్, మేగి నరసయ్య, మేగి నర్సింలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
