నారాయణ పాఠశాలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం…

0
65

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

స్థానిక విద్యానగర్‌లోని నారాయణ హైస్కూల్‌లో “జాతీయ విజ్ఞాన దినోత్సవం” వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి రూపొందించిన పలు నమూనాలు వారి సృజనాత్మకతకు అద్దం పట్టాయి.

రోబోటిక్ అబ్ స్టకిల్ కారు, అబ్ స్టకిల్ ఆబ్జెక్టివ్. న్యూటన్ గమన నియమాల వివరణ. మానవ విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, గుండె, కాలేయం వంటి ప్రధాన అవయవాల పనితీరు.కాలుష్య నివారణ మార్గాలు, ఆమ్ల వర్షాల ప్రభావం, కార్బోహైడ్రేట్ల నిర్ధారణ పరీక్షలు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళాచక్రపాణి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి విజ్ఞాన ప్రదర్శనలు ఒక చక్కని వేదిక” అని కొనియాడారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ వేడుకలో నారాయణ పాఠశాలల ఏజీఎం అన్నం చైతన్య రావు, ఆర్ఐ చీటీ సత్యం రావు, ప్రధానోపాధ్యాయులు మదన శాంతి కిరణ్, డీన్ నవీన్ కుమార్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజేశం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ పిల్లల ప్రదర్శనలను చూసి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here