బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఈ రోజు రెయిన్బో ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి,మాజీ కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి పూర్ణచందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ సర్.సివి రామన్ భారత దేశంలో జన్మించి తన పరిశోధనల ద్వారా నోబెల్ ప్రైస్ పొందిన మొట్టమొదటి ఆసియా ఖండానికి చెందిన వ్యక్తి
సర్ సి.వి రామన్ గారు వారు విజ్ఞాన రంగంలో చేసిన కృషికి గుర్తుగా ఈ రోజు జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు అన్నారు.జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని రెయిన్బో ఉన్నత పాఠశాలలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల ముఖాల్లో సంతోషం వారి సృజనాత్మకత ఆలోచనా విధానం వివరణ విశ్లేషణ చూస్తుంటే ఈరోజు నాకు చాలా సంతోషం కలిగిందని అన్నారు. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఉపాధ్యాయులు మరియు విజ్ఞాన పుస్తకాల నుండి మంచి జ్ఞానాన్ని పొంది భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేయాలని తద్వారా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని సృజనాత్మకతతో తమ చదువులు సాగించాలని ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన విజ్ఞాన ప్రదర్శనలు వాటి పని విధానాలను వాటి ఉపయోగాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెయిన్బో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,ఉపాధ్యాయులు,ప్రముఖులు,విద్యార్థులు పాల్గొన్నారు.