బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న డాక్టర్ సి.వి. రామన్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల భాగ్యరేఖ మరియు ఉపాధ్యాయ బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే సైన్స్ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొని ప్రపంచ యవనికపై భారతదేశ కీర్తిని చాటిన సి.వి. రామన్ నేటి తరం విద్యార్థులకు ఆదర్శప్రాయుడని కొనియాడారు.
ప్రధానోపాధ్యాయురాలు నాగుల భాగ్యరేఖతో పాటు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

