బలగం టీవి, రుద్రంగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు.అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జాతీయ ఓటర్ల దినోత్సవన్నీ నిర్వహించారు. కృష్ణవేణి స్కూల్లో విద్యార్థులచే మాక్ ఎలక్షన్ నిర్వహించారు..ఈ సందర్భంగా విద్యార్థుచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించి ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. ఓటు అనేది సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని అన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అర్హులని ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ చాలా గొప్పదని దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు,అర్హలైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు కళాశాల పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..