ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్
బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జర్నలిస్టు న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ: జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఈనెల 12వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రయత్నం చేస్తున్నామని,ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మండలంలోని విద్యార్థిని, విద్యార్థులు,యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బోయినిపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.దేశంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని,వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి విద్యార్థులు,యువత నిరంతరం తమ లక్ష్యాల దిశగా ముందుకు వెళ్లాలని తెలిపారు.భారత దేశ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా మహానగరంలో జన్మించి, ప్రపంచానికే తలమానికంగా ఎన్నో స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇచ్చి,, ఎంతోమందికి స్ఫూర్తిదయకంగా నిలిచి, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు స్వామి వివేకనంద అని వారి యొక్క జయంతిని జరుపుకోవడం ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కు అని అన్నారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి బోయిని వేణు యాదవ్,ప్రతినిధులు ఎడపల్లి వంశీకృష్ణ,గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు