బలగం టివి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో దేశాయి బీడీ కంపెనీ, మరి చారి బాయ్ బీడీ కంపెనీ లలో పనిచేస్తున్న బీడీ కార్మికులు ఈనెల ఫిబ్రవరి 16,న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు తిప్పాపురం బస్టాండు వద్దకు రావాలని ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది.ఈనెల ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆ రోజున వేములవాడకు పెద్ద ఎత్తున తరలిరావాలని సిఐటియుగా పిలుపు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్, బీడీ కార్మికులు మహేందర్, భాస్కర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.