మనిషిని అనారోగ్యం పాలు చేస్తున్న అధిక బరువు, షుగర్ వ్యాధి, అల్సర్, గ్యాస్, మలబద్ధకాన్ని అరికట్టే ప్రకృతి ఆహారం క్రమబద్దంగా, నియమానుసారంగా పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. దేశీ నాచురల్స్ ఆర్గానిక్, నాచురల్ ప్రొడక్ట్స్ మనిషి ఆరోగ్యానికి చాలా మంచిదని సనాతన ధర్మం చెబుతుంది.నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణ ఆర్గానిక్ మేళా నిర్వహించారు.
ఈ మేళలో సనాతన ధర్మానికి సంబంధించిన దేశీ న్యాచురల్స్ ప్రోడక్ట్ స్టాల్ ను మేళలో ఏర్పాటు చేసారు. అయితే వారి వద్ద ఉన్న ప్రొడక్ట్స్ ను న్యాచురల్ గా తయారు చేస్తారు. ఖాదర్ వాలి చెప్పేది ఒక్కటే మన సనాతన ధర్మంలో గోవుకు చాలా ప్రాముఖ్యత ఉందని లావణ్య చెబుతున్నారు. గోమూత్రం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. రోగనిరోదక శక్తిని కూడా పెంచుతుంది.
గోమూత్రాన్ని ప్రతిరోజు పరగడుపున తాగాలి. త్రిపుల చూర్ణం కాఫా, వాతా, పిత్త దోషాలు పోతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. రాక్ సాల్ట్ తినడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు ఫిల్టర్ నూనెలు కాకుండా గానుగ కట్టెతో తయారుచేసిన నూనెలను వాడడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ దిశగా ఇప్పుడు అందరు కూడా సనాతన ధర్మం పాటించాలని ఆమె వివరించింది.