బలగం టివి: బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక వద్దగల కేడీసీసీ బ్యాంకు ముందు ఆదివారం రోజున ఎదురెదురుగా బైక్ ఆటో ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా,మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికుల సమాచారంతో 108 సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్ కు పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోయినిపల్లి ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా బాపూజీ నగర్ కాజీపేటకు చెందిన సిరిమల్ల పూర్ణచందర్, నూతి సాయికిరణ్ లు దర్శనం కోసం శనివారం సాయంత్రం వేములవాడకు వచ్చి ఆదివారం వేములవాడలోని రాజరాజస్వామి దర్శించుకొని తిరుగు ప్రయాణం, కాగా బోయినిపల్లి మండలం కొదురుపాక వద్ద, కరీంనగర్ నుండి వేములవాడ వైపు ఎదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ లతో ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో పూర్ణచందర్ 39 అక్కడికక్కడే మృతిచెందగా, సాయికిరణ్ కు గాయాలయ్యాయి. గాయాలైన సాయికిరణ్ ను కరీంనగర్ హాస్పిటల్ లకు తరలించారు. అలాగే వెనుక నుండి వస్తున్న కోనరావుపేట మండలం ధర్మారం చెందిన జక్కని రాజు అదుపుతప్పి కింద పడటంతో అతను కూడా గాయాలుగా స్థానికులు 108 సాయంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలనే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
బిజెపి మండల సీనియర్ నాయకులు కొండం శ్రీనివాసరెడ్డి
కొదురుపాక కే.డి.సి.సి బ్యాంకు ముందర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ యాక్సిడెంట్ వల్ల ఒక వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని, కాంట్రాక్టు నిర్లక్ష్యం వలన ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగిందని ఆన్నారు. ఎందుకంటే నెలల తరబడి ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని,కాంట్రాక్టరు తన స్వలాభం కొరకు ప్రభుత్వం నుండి అధిక నిధుల కొరకు రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యంచేయడం జరిగిందని ఆన్నారు. కనీసం ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయడం కూడా లేదన్నారు. ఇంత నిర్లక్ష్య కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
