బలగం టీవీ, ముస్తాబాద్ :
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల మున్నూరు కాపు పటేల్ సంఘం క్యాలెండర్ ను అధ్యక్షుడు మెంగని రాజు పటేల్ ఆధ్వర్యంలో కుల సంఘం సభ్యుల సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం అధ్యక్షునికి సంఘం సభ్యులు ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 22% జనాభాగా ఉన్నారని, పూర్వం నుండి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నామని వ్యవసాయ రంగాన్ని,పాడి రంగాన్ని కాపాడుతున్నారని పేర్కొన్నారు. మున్నూరు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కార్పొరేషన్,ఎమ్మెల్సీలలో భాగస్వాములుగా అవకాశం కల్పించి, సముచిత గౌరవాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, మనోహర్,దేవేందర్,స్వామి, నర్సయ్య, శంకరయ్య,మల్లేశం, శ్రీనివాస్,ధర్మేంధర్,బాలయ్య, సుధాకర్, అంజయ్య,దినేష్, శ్రీనివాస్,యాదగిరి, ఇస్తారి,రవీందర్,రాజం, గోపాల్, నర్సయ్య, బాలయ్య,నాగరాజు, సత్యం,రమేష్,రాములు,రాజు రాంచంద్రం, రమేష్,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.