బలగం టివి, ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగమన్నారు. నాయకులు కార్యకర్తలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు మాత్రం జవాబుదారితనంగా ఉండాలన్నారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తుందని ప్రజలకు భరోసా కల్పించమన్నారు పార్టీ కార్యాలయం ఎదుట కేకును కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శులు లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి,నాయకులు మర్రి శ్రీనివాసరెడ్డి, బుగ్గ కృష్ణమూర్తి, సూడిద రాజేందర్, రాజు నాయక్, అనవేని రవి, చేపూరి రాజేశం, గంట బుచ్చయ్య గౌడ్ పాల్గొన్నారు.