నాన్న కోసం.. కూతురు చల్మెడ నిహారిక..
ఆమెరికా నుంచి వచ్చి నాన్న కోసం ఎన్నికల ప్రచారం
నాన్నను గెలిపించాలని ఇంటింటి ప్రచారం..
ప్రజలను ఆకట్టుకుంటున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు కూతురు నిహారిక ప్రచారం
సిరిసిల్ల న్యూస్: (వేములవాడ)

వేములవాడ నియోజకవర్గంలో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా..సింపుల్‌గా ఓ యువతి గ్రామాల్లో కలియతిరుగుతుంది. ఓట్‌ఫర్ కార్ అంటూ.. జనం వద్దకు వెళ్తూ.. బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ప్రచారం చేస్తుంది.తన ముద్దు ముద్దు మాటలతో.. పల్లె జనంతో కలిసిపోయి.. అమ్మా నా పేరు నిహారిక.. నాన్నను గెలిపించండి.. ఐదేండ్లు మీకు సేవ చేస్తం.. అంటూ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పల్లె జనాన్ని ఆకట్టుకుంటుంది. ఈ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న యువతి ఎవరో కాదు..చల్మెడ విద్యాస్థంస్థల అధినేత , వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహా రావు చిన్న కూతురు చల్మెడ నిహారిక. నెల రోజుల కింద ఆమెరికా నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగం వదిలి.. నాన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ఇండియా వచ్చింది.

చల్మెడ నిహారిక ఆమెరికాలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. తన తండ్రి చల్మెడ లక్ష్మీనరసింహా రావుకు వేములవాడ బీఆర్ఎస్ టికెట్దక్కడంతో నాన్నపై ప్రేమతో ఎన్నికల ప్రచారం కోసం ఆమెరికా నుంచి వచ్చి తనదైన శైలిలో .. ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా వేములవాడ నియోజకవర్గంలో కలియతిరుగుతుంది. తన తండ్రికి సంబంధం లేకుండానే తన టీంను ఏర్పాటు చేసుకోని పల్లెల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఎప్పుడు ఎండకు బయటకు వెళ్లని నిహారిక నాన్న కోసం ఎండలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో చందుర్తి మండలం తిమ్మాపూర్, రామన్నపేట గ్రామంలో పలువురు మహిళలు ఎవల బిడ్డ ఇమే.. అందరితో మంచిగా మాట్లాడుతుంది.. ఏ ఊరు అనడంతో..పక్కనున్న బీఆర్ఎస్ లీడర్లు ఈ మేడం చల్మెడ లక్ష్మీనరసింహా రావు చిన్న బిడ్డా అంటూ పరిచయం చేస్తూ వస్తున్నారు. మొత్తానికి నిహారిక నాన్న కోసం ఎండలో ఎన్నికల ప్రచారం చేయడంతో వేములవాడ బీఆర్ఎస్ పార్టీలో నాన్నపై ప్రేమతో నిహారిక ఎన్నికల ప్రచారం అంటూ చర్చించుకుంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నప్పటికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా చల్మెడ నిహారిక నిలుస్తుంది. నాన్నకు ప్రేమతో.. ఈ ఎన్నికల్లో విజయం సాధించి పెట్టాలని నిహారిక పట్టుదలతో పని చేస్తుంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది.గ్రామాల్లో ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ప్రతి రోజు తన తండ్రి చల్మెడకు చెబుతూ ముందుకు వెళ్తుంది. నిహారిక ఉపన్యాసం.. మాటలు చూస్తుంటే నిహారిక కు కూడా మంచి మంచి రాజకీయ భౌవిష్యత్ ఉందని బీఆర్ఎస్ లో చర్చించుకుంటున్నారు.

