బలగం టీవి ,
తేదీ 5 సోమవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసినందుకు గాను కరీంనగర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసిన పోలీసులు అరెస్ట్ అయిన వారిలో
ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు
భూక్య తిరుపతి నాయక్
జక్కుల నాగరాజు
కెమాసారం తిరుపతి
ద్యావ మధుసూదన్ రెడ్డి
ఆరెపల్లి సాయికృష్ణ

బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసారు
ఈ సందర్భంగా అరెస్టయినా నాయకులు మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిందని ఆనాడు కూడా మేము భయపడలేదని నేడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చిన మహానుభావుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన నోటికి ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడినందుకు మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపామని కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మమ్మల్ని అనచివేయాలని చూస్తుందని అన్నారు ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన పోరాడుతామని తెలియజేశారు మేము మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర రావు ని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోరని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తామని తెలిపారు