భూ భారతి కాదు భూ హారతి..

0
179
  • అక్రమ రిజిస్ట్రేషన్ సమాచారం కోసం లంచం డిమాండ్
  • రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్..!

బలగం టీవీ, నల్గొండ:

నల్గొండ జిల్లా, గట్టుప్పల్ మండలం, తెరట్పల్లి గ్రామానికి చెందిన ఓ అక్రమ రిజిస్ట్రేషన్ విషయంలో సమాచారం కోరిన బాధితుల నుండి లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ గట్టుప్పల్ మండలం, తెరట్పల్లి గ్రామంలో జరిగిన ఓ అక్రమ రిజిస్ట్రేషన్ పట్ల వివరాలు కోరుతూ బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమాచారం అందించేందుకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ వారిని రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టంలేని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు.

హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో బాధితుల నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here