ప్రభుత్వ విప్ కు ధన్యవాదాలు తెలిపిన రుద్రంగి రైతులు
బలగం టీవి ,రుద్రంగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువును ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఇరిగేషన్ అధికారులు సందర్శించారు.. కాగా గురువారం రుద్రంగి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కోసం ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో రుద్రంగి రైతులు గ్రామంలోని నాగారం చెరువు లీక్ అవుతున్న విషయాన్ని ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకువచ్చారు..దీనిపై స్పందించిన ప్రభుత్వ విప్ వేంటేనే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో వారు శుక్రవారం స్థానిక రైతులతో కలిసి నాగారం చెరువును పరిశీలించి మరమ్మత్తు గల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్య చెప్పిన వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు గ్రామ రైతులు ధన్యవాదాలు తెలిపారు..