బలగం టీవీ, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రం లోని శ్రీ వాణి హై స్కూల్ లో ఘనంగా వన్ లేర్న్ డే, నేషనల్ సైన్స్ డే నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పిల్లలు వివిధ సబ్జెక్టులకు సంబందించిన ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి చెప్యాల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలలో దాగి ఉన్నా ప్రతిభ, సృజనత్మాకత విలువలతో కూడిన విద్యా అందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గణగోని శ్రీకాంత్, ప్రిన్సిపాల్ కొయ్యడ సత్యనారాయణ,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శిల్ప, తిరుమల, లావణ్య, రాజు, రేణుక, అనిత, మౌనిక, స్వర్ణ, సుష్మ, రేష్మ, బాబు, శ్రీనివాస్ పిల్లలు పాల్గొన్నారు.
