బలగంటివి,,ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామ శివారులో ఆటో బోల్తా కొట్టిన సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం రాజన్నపేట గ్రామానికి చెందిన బత్తుల రవి (30) అనే వ్యక్తి రాగట్లపల్లి గ్రామానికి చెందిన సత్యం తో కలిసి రవి ఆటోలో రాజన్నపేటకు వెళ్తున్నారు. రాజన్నపేట గ్రామ శివారు వద్దకు రాగానే ఆటో ప్రమాదవశాస్తూ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రవికి తీవ్ర గాయాలు కాగా సత్యం కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా హుటా హుటిన ఎల్లారెడ్డిపేట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో సత్యం కు సంబంధించినటువంటి వ్యక్తులు రవికి సంబంధించిన వ్యక్తులు ఆస్పత్రిలో ఘర్షణకు దిగగా సుమారు గంటసేపు ఉధృతికత వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి ఇరువురి కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరించారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
