కొనసాగుతున్న ప్రజాపాలన గ్రామసభలు…

0
106

బలగం టీవి, గంభీరావుపేట :
గంభీరావుపేట మండలంలో ప్రజాపాలన గ్రామసభలు కొనసాగుతున్నాయి . మంగళవారం లింగన్న పేట, కొత్తపళ్లి, ముస్తఫా నగర్ మరియు దమ్మున్నపేట పంచాయతీల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించి దరఖాస్తు ఫారాలు అందజేయడంతోపాటు స్వీకరించారు. కొత్తపల్లి, లింగన్నపేట గ్రామాల్లో నాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పిసిసి అధికార ప్రతినిధి ఉమేష్ రావు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ఈ కార్యక్రమం జనవరి 6వరకు కొనసాగుతుందన్నారు. దరఖాస్తులను జాగ్రత్త నిం పాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here