ఆపరేషన్ సింధూర్.. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు..

0
130

బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:

  • ఆపరేషన్ సింధూర్ దిగ్విజయం అవ్వాలని, భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

భారత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత వైమానిక దళం, నావికాదళం మరియు సైన్యానికి దైవిక బల రక్షణ మరియు ఆశీస్సులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలననుసరించి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం, అలాగే దేశవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యం నెలకొనాలని ఆలయము నందు చండీ సహిత రుద్ర హోమం నిర్వహించడం జరిగింది.
భారతావని పై ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని దక్షిణ కాశీ గా పేరు గాంచిన వేములవాడ ఆలయ అర్చకులు , ఉద్యోగులు కోరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here