అధికారంలో ఉన్న.. ప్రతిపక్షంలో ఉన్న..

0
97

ఆ పదవికే వన్నె తెస్తున్న సిరిసిల్ల ఎమ్మెల్యే Kalvakuntla Taraka Rama Rao – KTR గారు

ఎవరు ఏమనుకున్న పర్వాలేదు.. సిరిసిల్ల ప్రజలుగా మేం గర్వపడుతున్నం..

ఒక పార్టీ వర్కింగ్‌‌ గా మా సిరిసిల్ల ఎమ్మెల్యేగా పక్కన పెడితే.. అధికారం లో ఉన్నప్పుడు కేటీఆర్‌‌ తెలంగాణా కు పెట్టుబడుల విషయంలో కానీ, అభివృద్ది విషయంలో కానీ,తనకున్న విషయ పరిజ్ఞానంలో కానీ తెలంగాణాకే కాదు.. మా సిరిసిల్ల ప్రాంతానికి కూడా గొప్ప పేరు వచ్చింది.

కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాక కార్మిక క్షేత్రమైన సిరిసిల్లకు ప్రపంచ వాప్తంగా ఉన్న తెలుగు, తెలంగాణ వారందరికి సుపరిచితం అయ్యింది.

కార్మిక క్షేత్రంమైన సిరిసిల్ల లో ఆకలిచావులు, ఆత్మ*హ*త్యలు ఆగాయి.. అభివృద్ది పరుగులు తీసింది.

ఎవరు అధికారంలో ఉన్న కొన్ని తప్పులు, తప్పిదాలు దొర్లుతాయి.. అవి గ్రహించి.. తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్లడం రాజకీయ లక్షణం..

బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం తెలంగాణా లో అధికారం కొల్పోయాక.. గడిచిన రెండేళ్లలో కేసీఆర్‌‌ కుటుంబంపై కేటీఆర్‌‌ పై కాంగ్రెస్‌‌ సర్కారు అనేక కుట్రలు, కుతంత్రాలు, అబద్దాపు ప్రచారాలు, వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి.. కుటుంబాలను బయటకు లాగే ప్రయత్నాల్లో సీఎంతో సహా మంత్రులు సైతం బహిరంగాంగా.. ప్రత్యక్షంగా పాల్గొన్న సంఘటనలు ..

బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ గడిచిన రెండేళ్లలో ప్రతిపక్ష పాత్ర కు న్యాయం చేస్తున్నారు. అనేక కుట్రలను చేదిస్తూ.. ముందుకు సాగుతూ బీఆర్ఎస్‌‌ పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా రెండున్న ఏళ్లు ఉంది.. ప్రజా సమస్యలపై స్పందించకుండా.. బీఆర్ఎస్‌‌ ఉండిపోవచ్చు.. కాంగ్రెస్‌‌ కు ఇంకా వ్యతిరేఖత రావాలని చూడొచ్చు కానీ.. ప్రజలు గోస పడుతారు అనే కోణంలో.. ముందుకెళ్తున్నారు.

అధికారం కొల్పోయిన ప్రజల ఆధరణ, జన సమూహం చూస్తే ఎక్కడ.. తగ్గడం లేదనిపిస్తుంది.

గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్‌‌ సర్కారు వ్వవహార శైలి, తీరుతో ప్రజల్లో వ్యతిరేఖత పెరగడమే కాకుండా.. బీఆర్ఎస్‌‌ గ్రాఫ్ పెరుగుందని చెప్పాలి.

ముఖ్యంగా కాంగ్రెస్‌‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతూనే అనవసరపు పనులకు వెళ్తూ.. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చడాలు, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడాలు, వేల కొట్లతో విగ్రహాల ఏర్పాటుకు ప్రతిపాదానలు చేయడం.. తెలంగాణాలో ఇప్పుడు కాంగ్రెస్‌‌ సర్కారు పై విపరితీమైన వ్యతిరేఖత పెరగుతుంది.

ఇదే తరుణంలో బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ తీరిక లేకుండా.. రోజుకో జిల్లాలో.. ప్రజా సమస్యలపై స్పందించి పర్యటనలు చేయడం, ప్రెస్ మీట్లతో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ సర్కారు తప్పిదాలను ఎండగుడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

నూటికి నూరుశాతం ప్రతిపక్ష పాత్రకు న్యాయం చేస్తూ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్ సక్సెస్‌‌ అవుతున్నారు.

గత పదేండ్లలో బీఆర్ఎస్‌‌ చేసిన కొన్ని తప్పిదాలను మననం చేసుకొని సరిదిద్దుకునే పనిలో పడ్డారనిపనిస్తుంది. ఇప్పుడు కేటీఆర్‌‌ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా.. తన నియోజకవర్గం సిరిసిల్ల లో వరుస పర్యటనలతో ఒక ఎమ్మెల్యేగా.. తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలోనే తన పార్టీకి ఎక్కువ ఫలితాలు తీసుకురావడం విశేషం.

సామాన్య కార్యకర్తలను కూడా కలుస్తూ.. పార్టీ క్యాడర్‌‌ లో కూడా జోష్ నింపుతున్నారు.

ఈ మార్పు ఇలానే ఉంటే బాగుంటుంది.. బీఆర్ఎస్‌‌ లో ఉన్న ప్రతి నాయకుడు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం ఐతే.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు తిరుగుండదు.

కొన్ని సందర్బాల్లో బీఆర్ఎస్‌‌ నేతల అతి, లెక్కలేని తనం, ప్రజలను, కార్యకర్తలను దూరం పెట్టడంతో ఈ పరిస్థితి, దుస్థితి వచ్చింది అని చర్చ జరుగుతుంది.

ప్రతిపక్ష నేతగా కేటీఆర్‌‌ ఇలానే పని చేస్తే ప్రజల సమస్యలు అధికార పార్టీ సచ్చినట్లు చేయాల్సిందే.. ప్రజా పోరాటలకు తలొగ్గాల్సిందే..

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లో విద్యావంతుల్లో, కళాకారుల్లో, మేధావి వర్గాల్లో, రైతాంగంలో, మహిళల్లో, వ్యాపారవర్గాల్లో గత సర్కారే బాగుండే అనే భావన కలిగి మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.

తెలంగాణా పగ్గాలు పరోక్షంగా ఎక్కడ పరాయి పాలకుడి కిందకు వెళ్తుందో.. అనే భయం పట్టి పీడిస్తుంది. తెలంగాణ మట్టిన ప్రేమించే వారు, తెలంగాణా అస్థిత్వాన్ని గౌరవించే వారికే ప్రస్తుతం ఎక్కువ మద్దతు లభిస్తుంది.

కాంగ్రెస్‌‌ సర్కారు చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు, పేదల ఇండ్లు కూల్చడాలు, భూములు లాక్కొవడాలు, హైడ్రా పేరిట అధికారిక అరచాకాలు చేయడాలు, కొంత మంది ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు తమ తమ నియోజకవర్గాల్లో అడ్డగోలు వ్యవహారాలు రాజకీయ కక్షలతో ఇతరులను ఇబ్బంది పెట్టడం వంటి వాటితో కాంగ్రెస్‌‌ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది.

అధికారం ఉన్న లేకున్న.. ప్రజల కోసం ఇలానే ఒక పార్టీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ గా తన పనితీరును, ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. తన పోరాట పటిమను కొనసాగిస్తే.. బీఆర్ఎస్‌‌ పార్టీకి బౌవిష్యత్‌‌ లో తిరుగుండదు.

గతంలో చేసిన తప్పిదాలు సరిదిద్దుకోవాలి.. ఉద్యమాకరులను అక్కున చేర్చుకోవాలి.. కార్యకర్తలను కాపాడుకోవాలి.. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే నాయకులను, బంధువర్గాన్ని దూరం పెట్టాల్సిందే..

ఆల్ ది బెస్ట్‌‌ కేటీఆర్‌‌ సర్..

ఒక జర్నలిస్టుగా కాదు.. మా సిరిసిల్ల ఎమ్మెల్యే గా మీ కష్టాన్ని రాష్ట్ర వాప్తంగా గుర్తించి ఒక ఓటరుగా మాత్రమే ఈ పోస్టు రాస్తున్న.

చాలా సార్లు మీ తప్పిదాలను ఎండగట్టిన వాన్ని.. ప్రజల కోసం పని చేసినప్పుడు కూడా ప్రజలకు తెలపడం నా బాధ్యతగా.. మీ పార్టీ నేతల్లో కూడా ఒక మార్పు రావాలనే ఒక ఆశతో.. కొన్ని సూచనలతో.. రాస్తున్న.. చిన్న విశ్లేషణ మాత్రమే.

BRS Party

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here