బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
టెక్స్ టైల్ పార్కు గేటు సమీపంలో గల రోడ్డుపై శనివారం రాత్రి ఐచర్ వ్యాన్ మంటల్లో కాలిపోవడంతో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మంటలు ఆర్పారు.అట్టి సంఘటన గురించి టెక్స్ టైల్ పార్కు గ్రామ కారోబార్ అయినా గౌడ రాజ మహేందర్ అను వ్యక్తి ఆదివారం రోజున పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా, పోలీసు తగిన విచారణ అనంతరం చాకచక్యంగా వ్యాన్ ఓనర్ అయిన నిమ్మల మహేష్ తండ్రి చంద్రయ్య, అను అతడిని పట్టుకొని విచారించగా, అతడు 9 నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా వ్యాను కొనుగోలు చేసినని, అట్టి వ్యాను తరచు రిపేరుకు రావడంతో సరియైన కిరాయిలు దొరకకపోవడం నెల నెల ఈఎంఐ లు డబ్బులు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నందున ఎలాగైనా వ్యాను ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయింది అని ఇన్సూరెన్స్ వాళ్లను నమ్మించి, వచ్చిన డబ్బులతో ఫైనాన్స్ యొక్క డబ్బులు కట్టగ మరియు తన ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు తీరుతాయని ఉద్దేశంతో నిన్న రాత్రి పెట్రోల్ బంకులొ పెట్రోల్ తీసుకొచ్చి తన వ్యాన్ క్యాబిన్లో పెట్రోల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారి పోయినట్లుగా నేరం ఒప్పుకున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.