ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను ఫాక్స్ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి పరామర్శించి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. మండల కేంద్రానికి చెందిన జంగం లక్ష్మీ నరసవ్వ,బుర్కలింగం అనే వ్యక్తులు ఇటీవ ల మరణించగా,బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్యపడొద్దు.. అండగా ఉం టామని బాధిత కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. 5000 రూపాయలు చొప్పున ఇద్దరికీ ఆర్థిక సహాయం కొడుకు దేవేందర్ స్రవంతి, లింగం భార్య రేవతి లకు అందజేశారు.అక్కడ బురుక ధర్మేందర్ గుంటుక రామరాజం, గడ్డం జితేందర్, కొర్రి ప్రమోద్, రేసు జగన్, బుర్క ఎల్లం,కొత్త శ్రీనివాస్, కొంపల్లి రమేష్,ఈసరి కిరణ్,గడ్డం వెంకటేష్,ఈసరి నరేందర్, గుంటుక రవి,బుర్క సతీష్, క్యారం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
