ప్రమాద అంచున పదిర బ్రిడ్జి: తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలి..

0
89
– జిల్లా ఉద్యమకారులు మారావేణి రంజిత్ కుమార్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

పదిర గ్రామంలోని ప్రధాన వంతెన అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుందని, ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని జిల్లా ఉద్యమకారులు మారావేణి రంజిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా తయారైందని, దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం సరికాదని ఆయన విమర్శించారు. వంతెనపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో రాకపోకలు సాగించే వాహనదారులు, స్థానిక ప్రజలు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. “ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం అధికారుల బాధ్యత. నిర్లక్ష్యంతో కూడిన ఈ వ్యవహారం వల్ల ఏవైనా ప్రాణనష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, బ్రిడ్జికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. లేనిపక్షంలో ప్రజలను సమీకరించుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం” అని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here