పహల్గావ్ ఉగ్రదాడి: రెడ్డి సంఘం సంతాపం

0
40

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రెండు రోజుల క్రితం కాశ్మీర్‌లోని పహల్గావ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది హిందూ బంధువులు మృతి చెందడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఉగ్రదాడి అత్యంత దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అన్ని కులాలను సమానంగా, సోదర భావంతో చూసే భారతదేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో హిందువులపై ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, మృతి చెందిన హిందూ బంధువుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. వారి కుటుంబాలకు సంఘం తరపున మనోధైర్యాన్ని అందిస్తూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషాద సమయంలో అందరూ కలిసి బాధితుల కుటుంబాలకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, మడుపు ప్రమోదరెడ్డి, నరెడ్ల రాఘవరెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, డబ్బు తిరుపతిరెడ్డి, గడ్డమీద ప్రసాద్ రెడ్డి, కూతురు వెంకట్ రెడ్డి, లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు దుండ్రా జలజా రెడ్డి, ముసుకు తిరుపతిరెడ్డి, ఏమి రెడ్డి కనక రెడ్డి, జువ్వెంతుల లక్ష్మారెడ్డి, మంద బాల్ రెడ్డి, కోశాధికారి ఎడ్మల హనుమంత రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భీమ నీలిమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రాజిరెడ్డి, కంది భాస్కర్ రెడ్డి, కరెడ్ల మల్లారెడ్డి, అబ్బాడి తిరుపతి రెడ్డి, గడ్డం సత్యనారాయణ రెడ్డి, బిచ్చల రాజిరెడ్డి లు తమ సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here