బలగం టీవి , రాజన్న సిరిసిల్ల
రాబోవు రోజుల్లో మాధకద్రవ్యాలను నిర్ములించేది నేటి తరం విద్యార్థులే
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,

“యాంటీ డ్రగ్ క్లబ్స్” ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కళాశాలల్లో, పాఠశాల్లో విద్యార్థిని విద్యార్థులకు మాధకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల, వికాస్ డిగ్రీ కళాశాలలో ఏర్పటు చేసిన పోటీలకు ముఖ్య అతిధిగా హాజరై మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాల మీద దిశానిర్దేశం చేశారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
ప్రతి ఒక్కరు మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని,రాబోవు రోజుల్లో మాధకద్రవ్యాలను నిర్ములించేది నేటి తరం విద్యార్థులే అని అన్నారు. విద్యార్థుల దృష్టి తమ కెరీర్ మీద మాత్రమే ఉండాలని,నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఎస్పీ గారు సూచించారు.డ్రగ్స్ వాడడం అనేది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడుచేస్తుందని ప్రతి ఒక్కరికి గుర్తు చేశారు.
జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వవిన్నూత కార్యక్రమాలు చేపడుతూ మత్తు పదార్థాల మీద అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే జిల్లాలోని అన్ని పాఠశాల, కళాశాల విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి యాంటీ డ్రగ్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
విద్యార్థిని విద్యార్థులు మత్తు పదార్ధాలకు మరియు చెడు అలవాట్లను ప్రోత్సాహించే వారికి దూరంగా ఉండాలని అన్నారు.యాంటీ డ్రగ్ క్లబ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణ మీద స్లోగన్ కాంపిటీషన్ ,వ్యాసరచన,డిబేట్ పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహమతులు అందజేయడం జరుగుతుంది అన్నారు.
” మేము డ్రగ్స్ తీసుకొము,బంధుమిత్రులు ,చుట్టుపక్కల వారు ,స్నేహితులు మాధకద్రవ్యాలకు అలవాటు పడకుండా వారిని చూసుకునే బాధ్యత మాదే అని డ్రగ్స్ వల్ల కలిగే అనార్ధాల గురించి వారికి వివరిస్తాం ” అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించిన జిల్లా ఎస్పీ .
జిల్లాలో గంజాయి కి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సరే వెంటనే డైల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోపంగా ఉంచబడతాయని తెలిపారు.
ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి వారికి జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాలు, బహమతులు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్,టౌన్ సి.ఐ రఘుపతి, ఎస్.ఐ రాజు,పాటశాల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.