రాజన్నసిరిసిల్ల జిల్లా లో ఎన్నికలు ప్రశాంతం..
సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి.. ఎస్పీ అఖిల్ మహాజన్ల సక్సెస్ స్టోరీ
మొన్న వరదలు.. నిన్న సెస్ ఎన్నికలు.. నేడు అసెంబ్లీ ఎన్నికలు ..
సిరిసిల్ల జిల్లా లో యువ ఆఫీసర్ల తమదైన ముద్ర
చిన్న వివాదం లేదు.. ఒక్క లొల్లి లేకుండా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు..
బలగం టీవి, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువ ఆఫీసర్ల జత కుదిరింది.. కొఅర్డినేషన్ అదిరింది.. రాజన్నసిరిసిల్ల జిల్లాలో పాలనపరమైన విషయాల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి.. శాంతిభద్రతల విషయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్నసిరిసిల్ల జిల్లాలో విధి నిర్వహణలో.. పనితీరులో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో జిల్లాలో జరిగే ప్రతి ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు.. సంఘటనలను విజయవంతంగా తమదైన శైలిలో ముగిస్తున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. చాకచక్యంగా తమ విధులను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా లో ఏ చిన్న సమస్య ఏర్పడిన రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది.

మీడియాలో కూడా అదేవిధంగా ఫోకస్ అవుతుంది. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్గా అనురాగ్ జయంతి, ఎస్పీగా అఖిల్ మహాజన్ బాధ్యతలు స్వీకరించాక.. రాజన్నసిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల విషయం కానీ ఇతర విషయాల్లో జిల్లా అధికార యంత్రాంగం విజయవంతంగా విధులు నిర్వహించి విజయం సాధిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో వరదలు రాగా.. జిల్లాలో ప్రాణ నష్టం వాటిల్లకుండా.. ఆస్థినష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహించింది. అనంతరం సిరిసిల్ల సెస్ ఎన్నికలు బీజేపి, బీఆర్ఎస్ మధ్య హోరా హోరి జరరగా.. శాంతిభద్రతలు విఘాతం కలిగే అవకావాలు ఉన్న.. పోలీసు శాఖ సమర్థవంతంగా సెస్ ఎన్నికలను ప్రశాంతంగా ముగించారు. తాజాగా సిరిసిల్ల జిల్లా లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవంచానీయ సంఘటనలు జరగకుండా.. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి లోటు పాట్లు లేకండా విమర్శలు..వివాదలు తలెత్తకుండా పకడ్బంది చర్యలు చేపట్టి సక్సెస్ అయ్యారు.

గతంతో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల లో ధర్నాలు.. ఆందోళనలు ..చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకున్నాయి. కానీ ఈ సారి చిన్న సమస్య తలెత్తకుండా.. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్వంలో సమర్థవంతంగా తమ విధులను నిర్వహించారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీలోకి పోటీ హోరా హోరీ ఉండగా.. ఈ చిన్న సమస్య తలెత్తిన పెద్ద గొడవలు.. ఆందోళనలు జరుగుతాయని అనుకున్నారు. కానీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు.. వివిధ రాజకీయ పార్టీ ముఖ్యలతో కూడా కొఅర్డినేషన్ సమావేశాలు నిర్వహించి అందరి సహకారంతో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా లో ఇద్దరు యువ ఆఫీసర్లు కలెక్టర్ అనురాగ్ జయంతి.. ఎస్పీ అఖిల్ మహాజన్ పనితీరుపై.. వారి సమర్థనీయతపైన జిల్లాలో చర్చ కొనసాగుతుంది.
