- రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని.
- పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్.
- హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రవికుమార్.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి గరిమ అగ్రవాల్, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కుమార్ తో కలిసి గురువారం హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉప సర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్ల పై వచ్చే ఫిర్యాదులు, తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ.. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలలో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగే లో చూడాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున సంబంధిత రిపోర్టులు టి- పోల్ నందు పెండింగ్ లేకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి వచ్చిన నామినేషన్లలో వాలీడ్ నామినేషన్ వివరాలు అప్ డేట్ చేయాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా సౌకర్యం కల్పించాలని, ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ నిబంధనల ప్రకారం ముద్రించాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరుగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యంగా మారుతుందని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా నిర్వహించే తనిఖీలలో అక్రమంగా నగదు, మద్యం, ఆభరణాలను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలించే పక్షంలో నిబంధనల ప్రకారం సీజ్ చేయాలని, పోలింగ్ నాడు సరిహద్దు ప్రాంతాల్లో అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
