బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం సందర్భంగా మండల ప్రత్యేక అధికారి ఎస్.వినోద్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని జయశీల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి, కేక్ కట్ చేసి, పంచాయతీరాజ్ శాఖ దినోత్సవాన్ని ఘనంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీధర్, మండల సూపరిండెంట్ జి.రవీందర్, జూనియర్ అసిస్టెంట్ జి.శ్రీనివాస్, టైపిస్ట్ వంశీకృష్ణరెడ్డి, మండల ఆపరేటర్లు, ఈజీఎస్ సిబ్బంది, గ్రామాల పంచాయతీ కార్యదర్శిలు శేఖర్, రాజశ్రీ, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.