పాశమైలారం ఘటన: బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

0
248

బలగం టీవీ, సంగారెడ్డి:

పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ముందుగా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు.

ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్యం, వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైద్యులకు సూచించారు.

ముఖ్యమంత్రి తో మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి తో పాటు అధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here