బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ తెలంగాణ మరియు జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ రజిత ఆధ్వర్యంలో పి సి పి ఎన్ డి టి అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయనైనది. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో గల స్కానింగ్ సెంటర్లు నియమ నిబంధనలు అనుసరించి నిర్వహించాలని స్కానింగ్ సెంటర్ ల తనిఖీలలో భాగం గా గుర్తించిన ఫామ్ ఎఫ్ ఆడిట్ లను, స్కానింగ్ సెంటర్ల వివరాలను ఈ కమిటీ సమావేశంలో చర్చించి రేడియాలజిస్ట్ లచే స్కానింగ్ నిర్వహించాలని వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు చట్టపరమైన చర్యలు గైకొంటామని ఈ సందర్భంగా తెలియజేసినారు. ఈ అడ్వైజరీ కమిటీ సమావేశంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, పి ఓ ఎం ఎస్ ఎన్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డి జి ఓ శోభారాణి , ఎన్జీవో చింతోజ్ భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతి ప్రకాష్ శుక్ల, , ఝాన్సీ లక్ష్మి, హెచ్ ఇ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.