బలగం టివి, తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో తాళ్లపల్లి రాజు తన గృహంలో అక్రమంగా నిల్వ ఉంచిన 42 క్వింటల్ల రేషన్ బియ్యాన్ని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అక్రమ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు పంపిస్తామని తెలిపారు.కానిస్టేబుల్ కరీం, రామ్మోహన్ హోంగార్డ్ పర్శరాములు పాల్గొన్నారు.