బలగం టివి ,
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,
ఈ రోజు ఇల్లంతాకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను, పోలీస్ అధికారులు, సీసీ కెమెరాల దాతలు, ప్రజాప్రదినిధులతో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన దాతలు ఓలాద్రి సత్యనారాయణ రెడ్డి,మల్లేశం గౌడ్,గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ ఎంపిటిసి, మహిళా సంఘo సోదరిమణులను, యువకులు, గ్రామస్తులను అభినందించిన జిల్లా ఎస్పీ .
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ….
సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని,గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపినారు. కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మిగితా గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరు ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ మధ్య కాలంలో జిల్లా పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారు జైలు శిక్ష లు అనుభవించడం జరిగిందన్నారు. వాహనాలు నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహన దారుడు నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు.
ఎస్పీ వెంట సి.ఐ సదన్ కుమార్, ఎస్.ఐ సుధాకర్, సర్పంచ్ జితేందర్ గౌడ్, ఎంపిటిసి స్వప్న,ఉప సర్పంచ్ కుమార్ యాదవ్,పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎం
