బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో పెండింగ్ చలాన్లను బుధవారం రోజున మండల పోలీస్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి,వాహన ధ్రువపత్రాలను పరిశీలించి, వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను బకాయిలను (వసూలు) కట్టించడం (వసూలు) జరిగింది. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని,సరైన దృవపత్రాలు ఉండాలని, వానాలపై ఉన్న 30 పెండింగ్ బకాయిలను కట్టించడం జరిగింది. ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90% డిస్కౌంట్, ఇతర వాహనాలకు 60%. ప్రభుత్వం జరిమానా తగ్గించినట్లు పోలీసులు తెలిపారు.
వాహాన తనిఖీలో హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ కోటి, సరేష్ కుమార్, హోంగార్డ్ వాసులు ఉన్నారు.