బలగం టీవి: రాజన్న సిరిసిల్ల
- ప్రజలకు, భక్తులకు గుడ్ ఫీల్ కల్పించాలి.
- మున్సిపాలిటీ, VTDA పరిధిలో పెండింగ్ పనులను మిషన్ మోడ్ లో పూర్తి చేయాలి.
- ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా వేములవాడ, ఆలయ పరిసరాలను తీర్చిదిద్దాలి
- క్యూ లైన్ ల క్రమబద్దికరణ, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి.
- భక్తుల కేంద్రం గా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి

– వేములవాడ అభివృద్ధిపై అధికారులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్ల 19, జనవరి 2024:
వచ్చే ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న దృష్ట్యా ఇప్పటికే శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తుల తాకిడి ఇప్పటికే పెరిగింది. మార్చి మొదటి వారంలో మహాశివరాత్రి జరగనున్న దృష్ట్యా మున్సిపాలిటీ, VTDA పరిధిలో పెండింగ్ పనులను మిషన్ మోడ్ లో పూర్తి చేసి దక్షిణ కాశీ గా పేరొందిన వేములవాడ ను ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ,శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగేలా తీర్చిదిద్దాలనీ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు.
కొత్త ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న భావన ప్రజల్లో కల్పించాలన్నారు. ప్రజలకు, భక్తులకు గుడ్ ఫీల్ అయ్యేలా చూడాలన్నారు.
శుక్రవారం సాయంత్రం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హల్ లో VTDA, టెంపుల్, మున్సిపాలిటీ అభివృధి పనులు, సాంకేతికదన్నుగా వరి పంట దిగుబడి పెంచేందుకు ” నా పంట” పేరుతో రూపొందించిన మొబైల్ ఆధారిత అప్లికేషన్ పనితీరు, కేజ్ కల్చర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే 3 గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..
శివరాత్రి జాతర కు ముందే
వేములవాడ గుడి చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తి అయినట్లు అధికారులు స్పష్టం చేసినందున ల్యాండ్ స్కేపింగ్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీనరి పెంపు వంటి పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. జనవరి మొదటి వారం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వేములవాడ కు వస్తున్న దృష్ట్యా పరిశుభ్రత పెంచేందుకు, వాష్ రూం లు క్లీన్ గా ఉంచేందుకు వీలుగా పట్టణాన్ని, ఆలయాన్ని భాగాలుగా చేసుకుని షిఫ్ట్ ల వారిగా సానిటేషన్ స్టాఫ్ కు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. శివరాత్రి జాతరను సజావుగా నిర్వహించేందుకు పగడ్బందీ కార్యచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.
శివార్చన స్టేజిని శివరాత్రి లోగా సిద్ధం చేయాలన్నారు. భక్తులు సులభంగా, వేగంగా దర్శనం చేసుకునేందుకు వీలుగా మూడు క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలన్నారు. VIP లతో సాధారణ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వేరు వేరు గా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. విఐపి ల కోసం ప్రత్యేకంగా బ్రేకు దర్శనాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
వచ్చే ఆదివారం నుంచి 24 గంటలు క్యూ లైన్ లను మానిటర్ చేయాలన్నారు. ఆలయం ను 4 భాగాలుగా చేసుకుని శానిటేషన్ లు 3 షిఫ్ట్ లలో 24 గంటలు చేపట్టాలన్నారు.
ధర్మగుండం లో శానిటేషన్ ఇంప్రూవ్ మెంట్ , నీటి శుద్ధి కోసం చర్యలు చేపట్టాలన్నారు.
ఇప్పటికే మంజూరైన రూ.5 కోట్లతో వేములవాడ పట్టణంలో ఉన్న సినారే ఆడిటోరియం ను పరిశీలించి ఆధునీకరణ చేయవచ్చో లేదో ఆర్ అండ్ బి అధికారులు అధ్యయనం చేసి కలెక్టర్ కు రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆదేశించారు. వేములవాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయినందున విద్యుత్ సహా, ఇతర పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
వేములవాడ – వట్టెంల రోడ్డు, వేములవాడ – కోరుట్ల రోడ్డు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.
మూలవాగు పై నిర్మాణంలో ఉన్న వంతెన పనులను వర్షాకాలం లోగా పూర్తి అయ్యేలా చూడాలనీ ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు.
వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్, జవహర్ లాల్ నెహ్రూ మార్కెట్, మూలవాగు చిల్డ్రన్ పార్క్ వద్ద గల వీధి వ్యాపారులతో సమావేశం నిర్వహించి, ముందుకు వచ్చే వ్యాపారులను వారినీ శ్యామ కుంట మార్కెట్ లో విక్రయాలు చేసుకునేందుకు వీలుగా ప్లేస్మెంట్ కల్పించాలని ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ లకు సూచించారు.
ముంపు గ్రామాలలోనీ ప్రజల జీవనోపాధుల కల్పన కు కార్యచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. 15 ముంపు గ్రామాలలోని మత్స్యకారులకు కేజ్ కల్చర్ పై అవగాహన కల్పించేందుకు సాధ్యమైనంత త్వరలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని జిల్లా మత్స్య అధికారి నీ ఆదేశించారు. కేజ్ కల్చర్ కు మిడ్ మానేరు జలాశయం ఎలా అనువైనదో వివరిస్తూ… కేజ్ కల్చర్ వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి అర్థం అయ్యేలా వివరించాలన్నారు.
అనంతరం ఒక్కో ఊరికి ఇద్దరు మత్స్యకారులను తీసుకొని ఇప్పటికే కేజ్ కల్చర్ విజవంతంగా చేపడుతున్న నల్గొండ,ఖమ్మం జిల్లాలకు ఎక్స్ పోజర్ విజీట్ కు తీసుకెళ్లాలని చెప్పారు. అనంతరం వారికి యూనిట్ లను మంజూరు చేయాలని చెప్పారు.
సాంకేతిక దన్నుగా
జిల్లాలో పంట విత్తే నాటి నుంచి కోతకు వచ్చి విక్రయించే దశ వరకూ వరి పంట ఉత్పాదకతకు, క్వాలిటీ కి ” నా పంట” అనే మొబైల్ ప్లాట్ ఫాం అన్ని విధాలుగా అనువుగా ఉన్నందున దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలనీ అధికారులకు సూచించారు.
అప్పర్ మానేరు డ్యాం కింద ఆయకట్టు 13 వేలకు ఎకరాల సాగుకు గానూ 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్న దృష్ట్యా మిగతా 3 వేల ఎకరాలకు కూడా సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గత వర్షాకాలంలో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువుల మరమ్మతుల కోసం అనుమతులు, నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులకు ప్రభుత్వ విప్ సూచించారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ….
శివరాత్రి జాతర మార్చి మొదటి వారంలో జరగనుండడం, సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా ఇప్పటికే ఆలయానికి రద్దీ పెరిగినందున భక్తులకు సజావుగా దర్శనం అయ్యేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తగినన్ని మరుగు దొడ్లు, డ్రెస్సింగ్ రూమ్ లు పెంచడం, మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మూల వాగు బండ్ పార్క్, పర్యాటక అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.గౌతమి, వేములవాడ ఆర్డీఓ మధుసూధన్, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాశ్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, ఆర్ & బి ఈఈ శ్యామ్ సుందర్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్, ఇంట్రా ఈఈ జానకి, జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, వేములవాడ మున్సిపల్ కమీషనర్ అన్వేష్, ఆలయ ఈఈ రాజేష్, పర్యాటక శాఖ డీఈఈ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చే జారీ చేయనైనది.