బలగం టివి,ఎల్లారెడ్డిపేట
లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్,గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం శిక్షణ తరగతులు నిర్వహించారు.
వ్యక్తిత్వ వికాస నిపుణులు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీ, ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కెప్టెన్, బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, సెక్రటరీ నాయిని భాస్కర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కోర్ కమిటీ మెంబర్ ఎనకగుర్తి రమేష్, లయన్స్ క్లబ్ బాధ్యులు పెంజర్ల దేవయ్య, పాటి దేవయ్య, ప్రధానోపాధ్యాయులు పాక మురళీధర్, మధుమాలతి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
