తెలంగాణ ఉద్యమ కళాకారుల సంక్షేమం కోసం వినతిపత్రం..

0
34

బలగం టీవీ, మంచిర్యాల:

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగ, వృత్తికళాకారుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రజానాట్యమండలి ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ కి వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలో, వృద్ధులైన కళాకారులకు పింఛన్లు, హెల్త్ కార్డులు అందించమని, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించిన కళాకారులకు సముచిత స్థానం కల్పించాలని, రాబోయే బడ్జెట్లో కళాకారుల సంక్షేమం కోసం కొంత శాతం ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు కల్పించిన రిజర్వేషన్ విధానం తరహాలో, కళాకారులకు కూడా కొంత శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

అంతేకాక, వృత్తికళాకారుల కోసం జిల్లా స్థాయిలో కళా ప్రదర్శనలు నిర్వహించడానికి డిపీఆర్‌ఓ మార్గదర్శకత్వం కావాలని, సాంస్కృతిక సారధిగా పనిచేస్తున్న కళాకారులకు ఉద్యోగ భద్రత కల్పించి, పర్మనెంట్ చేయాలని కూడా ప్రతిపాదించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగుంట చంద్రశేఖర్, మిట్టపల్లి పౌల్, గంగా రామ్, బియ్యాల ఉపేంద్ర, బబ్బర్ రాజేంద్ర, చొప్పదండి కిషన్, మిట్టపల్లి మల్లేష్, బొంకురి రామచందర్, రవి, పుష్ప, రమ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here