రైతుబంధు తక్షణ విడుదల కోరుతూ వినతిపత్రం – ఎల్లంపల్లి నీటి విడుదలకూ డిమాండ్..

0
49
  • రైతు సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ చందుర్తి చిలుక పెంటయ్య

బలగం టీవీ, చందుర్తి:

చందుర్తి మండల కేంద్రంలో రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించారు. రైతులకు రావలసిన రైతుబంధు నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రైతుల బాధలను దృష్టిలో పెట్టుకుని రైతుబంధు పథకాన్ని సమయానికి విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ రెండు సీజన్ల రైతుబంధు బకాయిలు ఇంకా చెల్లించలేదని, మూడో విడతపై కూడా స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చి, అనంతరం సంక్రాంతి నాటికి ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు కాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కావాలని, రైతులతో అబద్ధాలు ఆడడం తగదని అన్నారు. వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశలో ఉన్నందున ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని చెరువులన్నీ నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ స్థానిక తహసీల్దారు ద్వారా వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు మర్రి రాజు, మోత్కుపల్లి దేవయ్య, మర్రి చిన్నరాజు, ఎన్. రవీందర్ రెడ్డి, పోతరాజు తిరుపతి, బొల్లు వెంకటి, లింగంపల్లి అంజయ్య, మరి రాములు, ఎండి సమీర్, మాజీ సర్పంచ్ రమేష్ (కిష్టంపేట), మరి మల్లయ్య, తిప్పన్నరసయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here