ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై డీఈఓ(DEO)కు వినతి..

0
172
  • కంచర్ల రవి గౌడ్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా విద్యాధికారి (డీఈఓ) దృష్టికి తీసుకెళ్లింది. పాఠశాలల్లోనే పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ, ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతున్నారని, ఇది మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర భారంగా మారిందని అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన డీఈఓకు వినతిపత్రం సమర్పించారు.

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, పాఠశాల ఆవరణలో పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తిని పట్టించుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్, వడ్లూరి సాయి కిరణ్, షేక్ అప్రోచ్, కోడం వెంకటేష్, ఎండి అజ్జు, తిరుమలే రాకేష్, మొగిలి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here