*నాలుగు లక్షల ఆర్థికంగా నష్టం.
*నా జీవనాధారం కోల్పోయాను.
- బాధితుడు కొమ్మెట శ్రీకాంత్ ఆవేదన.
బలగంటివీ, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో ఫోటో స్టూడియో దగ్ధమైంది.మండలంలోని
బదనకల్ గ్రామానికి చెందిన కొమ్మేట శ్రీకాంత్ ముస్తాబాద్ లో గత రెండు సంవత్సరాలుగా ఫోటో స్టూడియో సొంతంగా నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు.బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరగడం వలన పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో షాపు వెనక ఉన్న వ్యక్తులు గమనించి షాప్ యజమానికి సమాచారం అందించడంతో వెంటనే షాప్ కు వచ్చి మంటలను ఆర్పి వేయడం జరిగిందని షాప్ యజమాని తెలిపారు.కొత్తగా తెచ్చిన కంప్యూటర్లు ప్రింటింగ్ మెషిన్ కీ చైన్లు గిఫ్ట్ ఆర్టికల్స్ ఫోటో ఫ్రేమ్స్ అన్ని కలిపి దాదాపు నాలుగు లక్షల నష్టం జరిగిందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.మొన్న మొన్ననే అప్పు చేసి కొన్నానని నా జీవనాధారం కుటుంబ పోషణ అంత ఈ ఫోటో స్టూడియో కావడం వలన ఏం చేయాలో తోచడం లేదని బాధితుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు.