అడుగు అడుగున కారు కే.. మా ఓటు అని ప్రజలంతా నీరాజనం..

0
41

గడిచిన రెండున్నర కాలంలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు…

బలగం టీవీ, సిరిసిల్ల:

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఒకటవ వార్డులో “గడప గడపకు గులాబీ జెండా” కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శించి, పార్టీ అభ్యర్థి బూర బాలు తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గడిచిన రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని, ఈ వైఫల్యాలను ప్రజలంతా గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 1 వ వార్డులో సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ చేసిన మోసాలను ఓటర్లకు వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి గెలిపించాలని బీఆర్‍ఎస్‍ నాయకులు ప్రచారం చేశారు.

వారి వెంట ఒకటవ వార్డ్ అభ్యర్థి బూర బాలు పాల్గొని ఓటర్లకు ఓటును అభ్యర్థిస్తూ కారు గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here