ప్రాణాల కోసం పోరాడుతున్న పదేండ్ల సహస్ర..

0
118
  • చిన్న సహాయం… ఒక ప్రాణానికి నూతన జీవితం
  • మనసున్నవారి చేయూత కోసం వేచిచూస్తున్న తల్లిదండ్రులు
  • చికిత్స కోసం రూ.30లక్షలు అత్యవసరం

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన ఒక పేద నేత కార్మికుడి కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉంది. తమ పదేళ్ల కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో, ఆ బిడ్డను కాపాడుకోవడానికి దాతల సాయం కోసం ఆ తల్లిదండ్రులు ఆర్తిగా ఎదురుచూస్తున్నారు.

సిరిసిల్ల పట్టణం 34వ వార్డుకు చెందిన అంబటి వేణు వృత్తిరీత్యా నేత కార్మికుడు. ఆయన భార్య బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి కుమార్తె అంబటి సహస్ర (10) గత కొంతకాలంగా తీవ్రమైన లివర్ వ్యాధితో బాధపడుతోంది. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌ లోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కు తరలించగా, వైద్యులు పరీక్షించి చిన్నారికి అత్యవసరంగా లివర్ మార్పిడి శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు సుమారు రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు అంచనా వేశారు. ఇప్పటికే అప్పులు చేసి రూ.5 లక్షల వరకు చికిత్స కోసం ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రోజువారీ కూలీ పనులపై ఆధారపడే ఆ కుటుంబానికి మిగిలిన మొత్తం సమకూర్చడం అసాధ్యంగా మారింది. “మా కళ్లముందే బిడ్డ మంచాన పడి ఉంది. మేము ఎంతో ప్రయత్నించినా అంత పెద్ద మొత్తం సమకూర్చలేకపోతున్నాం. దయచేసి దాతలు ముందుకు వచ్చి మా బిడ్డ ప్రాణాలను కాపాడాలి” అని తండ్రి అంబటి వేణు కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకునే దాతలు ఫోన్‌పే నంబర్లు 9912231674 లేదా 9676260746 కు ఆర్థిక సాయం పంపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మనసున్న వారు ముందుకు వచ్చి చిన్నారి సహస్రకు ప్రాణదానం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here