*ఆపద తెలిస్తే చాలు.అండగా పోచమ్మ యూత్
*ఆదర్శంగా నిలుస్తున్న పోచమ్మ యూత్ సభ్యులు.
బలగం టీవి, ముస్తాబాద్ :
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇరవై రోజుల క్రితం నిరుపేద కుటుంబానికి చెందిన మోతే నరేష్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.ఇప్పటి వరకు మండల ప్రజా ప్రతినిధులు ఎవ్వరు కూడా మమ్మల్ని పరామర్శించలేదని మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలియడంతో వారి కుటుంబ దీనస్థితిని చూసి చలించి పోయిన పోచమ్మ యూత్ సభ్యులు 50 కిలోల బియ్యం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఆపద అని తెలిస్తే చాలు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ మండలంలో ఆదర్శంగా నిలుస్తున్న పోచమ్మ యూత్ సభ్యులు గతంలో కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న వైనం పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.సహాయం చేసిన పోచమ్మ యూత్ సభ్యులకు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.