జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు..

0
54

మార్చి 31 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి – నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

  • జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల పాటు (మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు) జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఒక ప్రకటనలో తెలిపారు.

దీని ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు మరియు సమావేశాలు నిర్వహించరాదు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలను (DJ) వినియోగించారాదని తెలిపారు. అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేలా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here