సిరిసిల్ల న్యూస్:
ప్రస్తుతం అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అయిన వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన వాటిలో ఇతరుల మతం గురించి, పార్టీల గురించి, వ్యక్తిగత విషయాల గురించి అసభ్యకరమైన, ఎదుటి వారి మనోభావాలు కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం నేరంగా పరిగణించబడుతుందని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సిఐ కే. శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.ప్రతి గ్రూప్ మరియు పేజ్ లను పోలీసు వారు మానిటర్ చేయడం జరుగుతుందన్నారు.ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి అలాంటి మెసేజ్ లను పోస్ట్ చేయడం గానీ ఫార్వర్డ్ చేయడం గానీ చేయరాదన్నారు. చేసినట్లయితే గ్రూప్ అడ్మిన్ వెంటనే పోస్ట్ ని డిలీట్ చేసి, ఆ వ్యక్తిని గ్రూప్ నుండి రిమూవ్ చేయగలరు, లేనట్లయితే అడ్మిన్ భాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు. పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతవరణలో కొనసాగేలా చూడాలన్నారు.